స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన తుపాకులతో గన్ సెల్యూట్

 స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన తుపాకులతో గన్ సెల్యూట్

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు అధికారులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తుపాకులతో చేసే గన్ సెల్యూట్ కు ఈ సారి గొప్ప విశిష్టత ఉంది. గతేడాది వరకు ఈ కార్యక్రమంలో బ్రిటీష్ తుపాకులనే వాడేవారు. కానీ ఈ సారి ఆ స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు. పుణెలోని డీఆర్డీఓ శాస్త్రవేత్తలతో పాటు, ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 

ఇకపోతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ ఏడాదితో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.