ఆర్టీఐ రూల్స్ సవరణలను రద్దు చేయాలి లేదంటే జులై 5 నుంచి నిరాహార దీక్ష: అన్నా హజారే 

ఆర్టీఐ రూల్స్ సవరణలను రద్దు చేయాలి లేదంటే జులై 5 నుంచి నిరాహార దీక్ష: అన్నా హజారే 

పుణె: సమాచార హక్కు (ఆర్టీఐ) నిబంధనలకు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే, జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌కు లేఖ రాశారు. 

జూన్ 12న తెచ్చిన కొత్త రూల్స్ ఆర్టీఐ చట్టం పదునును తగ్గిస్తూ, పారదర్శకతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఆర్టీఐ దరఖాస్తు ఫీజుల పెంపును హజారే తప్పుపట్టారు. 

ఆర్టీఐ అనేది ఆదాయం కోసం తెచ్చిన చట్టం కాదన్నారు. అలాగే అప్లికెంట్స్‌‌కు గుర్తింపు రుజువును తప్పనిసరి చేయడాన్ని  ఆయన వ్యతిరేకించారు.