
ట్రాఫిక్ చలాన్ల బాధ తట్టుకోలేక ఆదిలాబాద్ పట్టణంలో.. ఓ వ్యక్తి ఏకంగా తన బండికి నిప్పుపెట్టాడు. పంజాబ్ చౌక్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మక్బూల్ బైక్‌పై వస్తుండగా, పోలీసులు వాహనాన్ని ఆపి సర్టిఫికెట్లు చూపించాలని కోరారు. సుమారు రూ.3 వేల వరకు పెండింగ్ చలాన్లు ఉండడం.. బైక్‌కు సంబంధించి సర్టిఫికెట్లు లేకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన మక్బూల్ తాను చలాన్లు కట్టబోనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
వారం కింద వెయ్యి రూపాయల జరిమానా వేస్తే చెల్లించానని.. ఇవాళ మళ్ళీ మరో వెయ్యి రూపాయల ఫైన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు తరచూ చలానాలు విధిస్తున్నారని.. అందుకే తన వాహనానికి నిప్పుపెట్టానని చెప్పాడు ఖానాపూర్ కు చెందిన మక్బూల్. పోలీసులు బైకు మంటలను ఆర్పేశారు.