హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల మధ్యలో సెంట్రల్ హాల్ నిర్మాణానికి డిజైన్లు రూపొందించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన కౌన్సిల్ లోని తన చాంబర్ లో ఆర్అండ్ బీ, లెజిస్లేచర్అధికారులు, అఘాఖాన్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్ స్థాయిలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల మధ్య సెంట్రల్ హాల్ నిర్మాణానికి అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాల్సి ఉందన్నారు. హాల్‌ను ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు.

