హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నా.. తెల్లవారుజామున మరింత జోరందుకుంది. ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, కోఠి, లక్డీకాపూల్ తో పాటు.. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉదయం 5 గంటలకు మొదలైన వాన... దాదాపు గంటకు పైగా వర్షం కురుస్తోంది.  దీంతో లోతట్టు ప్రాంతాలోకి వర్షం నీళ్లు వచ్చి చేరుతున్నాయి. 

అటు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. సిరిసిల్ల, సంగారెడ్డిలో 9 సెంటీమీటర్లు, హనుమకొండ,కామారెడ్డి, ఖమ్మంలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డ్ అయ్యింది. ఇవాళ, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు.