
- హైడ్రా ఉద్దేశం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది
- తెలుగు రత్న అవార్డు ప్రదానంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్
బషీర్‌బాగ్, వెలుగు: న్యాయాన్ని గెలిపించడమే హైడ్రా లక్ష్యమని.. అందరికీ హైడ్రా ఉద్దేశం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని కమిషనర్రంగనాథ్చెప్పారు. ఉగాది పండుగను పురస్కరించుకుని సైఫాబాద్‌లోని ఓకే టీవి ఆధ్వర్యంలో సోమవారం ‘తెలుగు రత్న’ పేరుతో అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, కమిషనర్రంగనాథ్పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్మాట్లాడుతూ.. హైడ్రా కమిషర్‌గా బాధ్యతలు చేపట్టాక ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
నల్లగొండ ఎస్పీగా ఉన్న టైంలో ప్రణయ్ హత్య కేసు విషయంలోనూ ఎన్నో మాటలు పడ్డానని చెప్పారు. ఆలస్యం అయినా ఇటీవల ఆ కేసులో వచ్చిన తీర్పు తన పనితీరుకు నిదర్శనం అన్నారు. హైడ్రా కూడా త్వరలోనే సిటీ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలుకు రంగనాథ్అవార్డు అందజేశారు.