కరోనా ఇంకా ఉందా.. కేసులు నమోదు అవుతున్నాయా..

కరోనా ఇంకా ఉందా.. కేసులు నమోదు అవుతున్నాయా..

కరోనా ఇంకా ఉందా.. కేసులు నమోదు అవుతున్నాయా.. ఈ టైటిల్ చూసి ఆశ్చర్యపోవచ్చు.. ఎందుకంటే కరోనాను చాలా మంది మర్చిపోయారు. అది వచ్చిపోయిన కలగా.. పీడకలగా భావిస్తున్నారు. కరోనా అనేది అసలు లేదని.. మాయం అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు.. మీరు అలా అనుకోవటంలో తప్పులేదు.. ఎందుకంటే కరోనా వార్తలు రావటం లేదు కదా.. వాస్తవంగా అయితే ఇప్పటికీ కరోనా మన సమాజంలో ఉంది.. రోజూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న అంటే.. 2023, జూన్ 21వ తేదీన దేశంలో 95 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 17 వందల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీళ్లందరూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు కూడా..

జూన్  22న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఒక్క రోజులో 95 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజా కొవిడ్ కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17వందల 84కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మరణించి వారి సంఖ్య 5లక్షల 31వేల 9వందలుగా నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు 4.49 కోట్ల కొవిడ్‌ కేసులు నమోదైనట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, జాతీయ కొవిడ్ - 19(COVID-19) రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4కోట్ల 44లక్షల 60వేల 82కి చేరుకోగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు.