కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు రెండో స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు రెండో స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే మీరాబాయి చాను భారత్కు తొలి గోల్డ్ మెడల్ ను సాధించిపెట్టగా.. తాజాగా  19 ఏళ్ల కుర్రాడు జెరెమీ లాల్రి నుంగా స్వర్ణ పతకాన్ని సాధించాడు. మెన్స్ 67 కేజీల ఫైనల్లో జెరెమీ బంగారు పతకాన్నికైవసం చేసుకున్నాడు. స్నాచ్‌ విభాగంలో 140 కేజీల బరువు ఎత్తిన అతను..క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీల బరువు ఎత్తి కొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా  300 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకాన్ని  గెలుచుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ కు మొత్తం ఐదు పథకాలు వచ్చాయి. ఇందులో రెండు గోల్డ్ మెడల్స్ కాగా రెండు సిల్వర్, ఒకటి బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లోనే భారత్ కు 5 మెడల్స్ రావడం విశేషం.

హ్యాపీగా ఉంది..
కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందని వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రి నుంగా అన్నాడు.   కానీ తన ప్రదర్శనతో సంతృప్తిగా లేనని చెప్పాడు.  తాను మెరుగ్గా రాణిస్తానని ఆశించానన్నాడు. ఏదైతేనేమి..దేశానికి స్వర్ణం గెలవడం గర్వకారణంగా ఉందన్నాడు. 

మోడీ అభినందనలు..
కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన జెరెమీ లాల్ రి నుంగాను ప్రధాని మోడీ అభినందించారు. కామన్వెల్త్ లో మన మన యువశక్తి చరిత్ర సృష్టిస్తోందని కొనియాడారు. జెరెమీ  కామన్వెల్త్ లో స్వర్ణాన్ని గెలుచుకుని.. అసాధారణమైన రికార్డును కూడా నెలకొల్పాడని మెచ్చుకున్నారు. చిన్న వయస్సులోనే దేశం గర్వించదగ్గ ప్రదర్శన చేశాడని పేర్కొన్నారు. జెరెమీ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోడీ తెలిపారు.

 

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు దూసుకెళ్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 55కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం గెలుచుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని సాధించి పెట్టింది. ఇప్పటికే మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గారు. దీంతో పతకాల పట్టికలో భారత్‌ టాప్-10లో నిలిచింది.