జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్

జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్

ముంబై:  సౌతాఫ్రికా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్.. ఇండియా టూర్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ మంగళవారం ఖరారు చేసింది. మూడు వన్డేలు, ఒక టెస్ట్, మూడు టీ20ల కోసం సఫారీ అమ్మాయిలు వచ్చే నెలలో ఇండియా రానున్నారు. ముందుగా  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13న బెంగళూరులో సౌతాఫ్రికా జట్టు..  బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వన్డే వార్మప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడనుంది. బెంగళూరు వేదికగా జూన్ 16, 19, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఇండియా, సౌతాఫ్రికా చెన్నై వెళ్లి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23 నుంచి జులై 1వ తేదీ వరకు ఏకైక టెస్టులో పోటీ పడతాయి. చెన్నై వేదికగానే ఇరు జట్లూ జులై 5, 7, 9వ తేదీల్లో 3 టీ20లో తలపడతాయని బీసీసీఐ ప్రకటించింది.