కేసీఆర్ బస్సు యాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు : కేటీఆర్‌‌‌‌‌‌‌‌ 

కేసీఆర్ బస్సు యాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు : కేటీఆర్‌‌‌‌‌‌‌‌ 
  •      బీఆర్​ఎస్​కు మెజారిటీ సీట్లు ఖాయం 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ఏ ఒక్క కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాదని బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్  అన్నారు. బీఆర్ఎస్  చీఫ్  కేసీఆర్  బస్సుయాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు మొదలైందన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియా సమావేశంలో కేటీఆర్  మాట్లాడారు.

కేసీఆర్  బస్సు యాత్రతో లోక్ సభ ఎన్నికలు ఒక మలుపు తిరిగాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. కేసీఆర్  ఉన్నప్పుడే బాగుండేనని రైతులు అనుకుంటున్నారని పేర్కొన్నారు. మంచినీళ్ల కోసం మళ్లీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆరోపించారు.

పదేండ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్న చందంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ఇరు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్  మెజారిటీ సీట్లలో గెలుపొందడం ఖాయమని కేటీఆర్  ధీమా వ్యక్తం చేశారు.