హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని కమర్షియల్ బిల్డింగ్స్ సీజ్.. లిస్ట్ ఇదే..

హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని కమర్షియల్ బిల్డింగ్స్ సీజ్.. లిస్ట్ ఇదే..

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని పలు బిల్డింగ్స్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. సంవత్సరాలుగా పన్నులు చెల్లించని కమర్షియల్ భవనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొండి బకాయిదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఖైరతాబాద్ సర్కిల్లో రూ.6.16 కోట్ల బకాయిలున్న శ్రీ లక్ష్మీ గాయత్రి హోటల్స్ బిల్డింగ్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. నాంపల్లిలోని అరోరా కాలేజ్ రూ.1.28 కోట్లు బకాయిలు ఉండటంతో సీజ్ చేశారు. గోషామహల్ ప్రాంతంలో సర్న ట్రాన్స్పోర్ట్ రూ.43.78 లక్షలు బకాయిలు ఉండటంతో అధికారులు సీజ్ చేశారు.

మొండి బకాయిదారులను సర్కిల్, జోన్ల వారీగా గుర్తించారు. వారందరికీ నోటీసులు ఇస్తున్నారు. నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని GHMC ఇప్పటికే హెచ్చరించింది. జీఐఎస్ సర్వే ద్వారా నగరంలో చాలా ఆస్తుల ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే తేల్చారు. ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్న లక్షా 20 వేల ఆస్తులకు నోటీసులు ఇచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ను మై క్యూర్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చెల్లించాలి. ప్రాపర్టీ ట్యాక్స్ను ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే వసూలు చేస్తారు.  ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వసూలు చేయకూడదని GHMC ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇంకా సీజ్ చేసిన బిల్డింగ్స్ వివరాలు ఇవే:
* జూబ్లీహిల్స్ సర్కిల్‌లో షహీమ్ సుల్తాన్ క్లాత్ సెంటర్ బిల్డింగ్పై రూ. 35.27 లక్షలు బకాయిలు ఉండటంతో సీజ్
* నాగార్జున సర్కిల్లోని సింఫోసిస్ బిజినెస్ సొల్యూషన్ బిల్డింగ్పై రూ.17.94 లక్షలు బకాయిలు ఉండటంతో సీజ్
* కొన్ని భవనాలపై 2012 నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తింపు
* మొండి బకాయిలు చెల్లించకపోతే బిల్డింగ్స్ సీజ్ కొనసాగిస్తామని హెచ్చరిక
* OTS పథకం కింద వడ్డీలో 90 శాతం డిస్కౌంట్ పొందవచ్చని తెలిపిన అధికారులు