మంచిర్యాల జిల్లాలో విషాదం.. యాక్సిడెంట్.. భర్త స్పాట్ డెడ్.. భార్య పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లాలో విషాదం.. యాక్సిడెంట్.. భర్త స్పాట్ డెడ్.. భార్య పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లా: మందమర్రి మండలం బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న భార్య భర్తలిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్పాట్లోనే భర్త చనిపోయాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. మందమర్రి మార్కెట్కు చెందిన పోషిణి వెంకటస్వామి అనే సింగరేణి కార్మికుడు చనిపోయాడు. భార్య పోషిణి సుమలత పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి వ్యక్తి మృతి చెందాడు. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ (54) ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా కీసర ఔటర్ రింగ్ వద్ద లారీ వెనుక టైర్ల కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.