అసలే గ్యాస్ సిలిండర్ల కోసం జనం తిప్పలు పడుతుంటే ఏం పనులివి.. బాన్సువాడలో ఏమైందో చూడండి..!

అసలే గ్యాస్ సిలిండర్ల కోసం జనం తిప్పలు పడుతుంటే ఏం పనులివి.. బాన్సువాడలో ఏమైందో చూడండి..!

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న హెచ్పీ గ్యాస్ సిలెండర్ల ఆటోను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో పబ్లిక్ దాడి చేస్తారనే భయంతో నడి రోడ్డు మీద ఆటో వదిలి డ్రైవర్ పారిపోయాడు. సింగిల్​ సిలిండర్​ వినియోగదారులు 25 రోజులకు, డబుల్​ సిలిండర్​ఉన్న వినియోగదారులు 45 రోజుల గడువుతో ఆన్​లైన్లో రీఫిల్​ బుకింగ్​చేసుకొని డెలివరీ బాయ్​ నుంచే అందుకోవాలని గోదామ్ల వద్దకు వెళ్లొద్దని ఒక పక్క అధికారులు చెబుతున్నారు. కానీ.. ఇలా డొమెస్టిక్ సిలిండర్లను ఆటోలకు ఆటోలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.

బుకింగ్​చేసిన నాలుగు రోజుల్లో సిలిండర్లు ఇళ్ల వద్దకు చేరుతాయని చెబుతున్నప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారం రోజులకు కూడా గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరడం లేదు. ఎదురుచూసి ఓపిక నశించి గ్యాస్ కోసం కొందరు వినియోగదారులు ఏజెన్సీల దగ్గరకు పోతున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఫిర్యాదు చేయడానికి 8500844365 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా పానిక్ బుకింగ్స్ పెరిగిపో యాయి. ఎక్కడా గ్యాస్ పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సరఫరా సజావుగానే కొనసాగుతోందని -తెలిపింది. కానీ భయంతో నిల్వలు పెంచుకోవడం వల్లే వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రపంచవ్యా ప్తంగా వివిధ మార్గాల్లో ఎల్పీజీని సేకరిస్తోంది. హర్ముజ్ జలసంధి దాటి ఎల్పీజీ నౌకలు ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి.