హైదరాబాద్ ORRపై.. మాగంటి గోపీనాథ్ కూతుర్ల కారుకు యాక్సిడెంట్.. పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు

హైదరాబాద్ ORRపై.. మాగంటి గోపీనాథ్ కూతుర్ల కారుకు యాక్సిడెంట్.. పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు

హైదరాబాద్: ORRపై దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లకు కారు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని మాగంటి కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. డీసీఎం వ్యాన్ టైరు ఉన్నట్టుండి ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.​​​​ కారులో ప్రయాణిస్తున్న మాగంటి ఇద్దరు కూతుర్లతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు.. మరో కూతురుకి స్వల్ప గాయాలయ్యాయి. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఆమెపై ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత మాగంటి కుటుంబం రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేదు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మాగంటి కూతుర్లు కూడా తమ తల్లికి మద్దతుగా ప్రచారం చేశారు. మాగంటి భార్య సునీత ఓటమి తర్వాత.. మాగంటి భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉండటం గమనార్హం.