రోజుకు 1.5జీబీ డేటా వాడుకోమని ఇచ్చి.. డేటా మిగిల్తే మిడ్ నైట్కు మాయం చేయడం ఏంటి ?: రాఘవ్ చద్దా

రోజుకు 1.5జీబీ డేటా వాడుకోమని ఇచ్చి.. డేటా మిగిల్తే మిడ్ నైట్కు మాయం చేయడం ఏంటి ?: రాఘవ్ చద్దా

టెలికాం కంపెనీల డైలీ డేటా ప్లాన్స్పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో గళమెత్తారు. టెలికాం కంపెనీలు డైలీ డేటా లిమిట్ ప్లాన్స్ను తీసుకొచ్చాయని.. డైలీ డేటా ప్లాన్స్ 1.5 జీబీ, 2జీబీ, 3జీబీ 24 గంటల వ్యాలిడిటీతో అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రతీ 24 గంటలకు ఈ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా డేటా రీసెట్ అవుతుందని.. అయితే మిగిలిపోయిన డేటా మిడ్ నైట్కు ఎక్స్పైరీ అయిపోతుందని ఆయన వివరించారు. ఆ మిగిలిపోయిన డేటాకు ఎలాంటి రిఫండ్ ఉండదని చెప్పారు.

ఇదేదో పొరపాటున జరుగుతుంది కాదని.. ఇది టెలికాం కంపెనీల పాలసీ అని తెలిపారు. అవసరం ఉన్నా లేకపోయినా వాడుకోవాలని లేకపోతే మిడ్ నైట్కు వ్యాలిడిటీ అయిపోతుందని.. ప్రస్తుతం ఇండియాలో మొబైల్ డేటాను టెలికాం కంపెనీలు ఇలా అందిస్తున్నాయని చెప్పారు. మిగిలిపోయిన.. వాడుకోని డేటాకు డబ్బులెందుకు కట్టాలని.. వాడుకోని డేటాను ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా జరిగితేనే.. రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు న్యాయం జరుగుతుందని.. వాళ్లు కడుతున్న డబ్బుకు విలువ ఉంటుందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో వాదించారు. ఈ అంశంపై ఆయన వాదనతో నెటిజన్లు ఏకపక్షంగా ఏకీభవించారు.

ఉదాహరణలతో సహా ఆయన వాదనను బలపరిచారు. ఒక కిరాణా షాపుకు వెళ్లి ఒక కిలో పంచదార కొన్నామనుకుందాం. ఆ కిలో పంచదారలో 800 గ్రాములు మాత్రమే వాడుకున్నాం. ఇంకా నా దగ్గర మిగిలిపోయిన 200 గ్రాముల పంచదారను అర్ధరాత్రి వచ్చి కిరాణా షాపు యజమాని తిరిగి తీసుకుపోడని.. టెలికాం కంపెనీల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని నెటిజన్లు చెప్పారు. టెలికాం కంపెనీల డైలీ డేటా లిమిట్పై వినియోగదారుల నుంచి గతంలోనూ తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయినప్పటికీ టెలికాం కంపెనీలు డైలీ డేటా వినియోగంపై 24 గంటల వ్యాలిడిటీ మాత్రమే ఇచ్చాయి. రోజుకు ఇంత అని ఆఫర్ చేసిన డేటాను వినియోగదారుడు వాడుకోకపోతే అది అతని సమస్య అని, తమకు ఏం సంబంధం ఉందని.. ఎందుకు ఆ డేటాను యాడ్ చేయాలనే రీతిలో టెలికాం కంపెనీలు వ్యవహరిస్తున్నాయి.