ఇరాన్ స్వయంగా చర్చలను కోరుకుంటోందని ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. చర్చల కోసం తటస్థ ప్రాంతంగా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అత్యంత సన్నిహితులు కుష్నర్, విట్‌కాఫ్ , వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, టర్కీ, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ ఈ చర్చల్లోపాల్గొననున్నారు. ఈ చర్చల కోసం ఈజిప్ట్ ,పాకిస్థాన్ వంటి దేశాలు చొరవ తీసుకుంటున్నట్లు ఓ ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ యాక్సియోస్ రిపోర్టర్ వెల్లడించారు. దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమం చేస్తూ అమెరికా ,ఇరాన్ ప్రతినిధులు ఈ వారంలోనే ఇస్లామాబాద్‌లో చర్చలు జరపవచ్చని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇరాన్ పవర్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ఇరాన్ స్వయంగా చర్చలకు వచ్చిందని..డీల్ కోసం ఆరాటపడుతోందన్నారు ట్రంప్. కాల్పుల విరమణ కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ వైపు నుంచి తనను సంప్రదించారని పేర్కొన్నారు. చర్చల కోసం ఇరానే ముందుగా సంప్రదించిందని ట్రంప్ చెప్పొకొచ్చారు. ఒకవైపు ఇరాన్ చర్చలే లేవు అంటూనే మరోవైపు ట్రంప్ డీల్ దాదాపు ఖాయం అనే సంకేతాలిచ్చారు. తమ దేశ ఇంధన వనరులపై అమెరికా దాడులు చేస్తుందనే భయంతో ఇరాన్ చర్చలకు వచ్చిందని ట్రంప్ చెప్పారు.
