జ్యోతిష్య ప్రకారం చంద్రుడు, గురు గ్రహాల కలయిక చాలా శక్తివంతమైనది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. మార్చి 27 వ తేదీన ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో కలిసి సంచారం చేయడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
గ్రహాల సంచారంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి.. వాటి స్థానాలు మారడంతో .. ఒక్కొక్కరి జీవితంతో అనూహ్యంగా మార్పులు వస్తాయి. అనుకోకుండా అదృష్టం వరించడం.. ఇక ఆ పని కాదు అనుకున్న పని అవడం జరుగుతుంది. మార్చి 27 వ తేదీన గురుడు... చంద్రుడు మిథురాశిలో కలవడం వలన గజకేసరి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంలో మూడు రాశుల ( మిథున, సింహ, కన్య)వారు పట్టిందల్లా బంగారమే కానుంది.
మేష రాశి: గురుడు, చంద్రడు... ఈ రెండు గ్రహాలు మిధున రాశిలో కలవడం వలన మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఆర్ధిక వ్యవహారాలు స్వల్ప మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలయించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశి : గురుడు.. చంద్రుడు కలిసి మిథున రాశిలో సంచరించడం వలర ఈ రాశి వారికి అతి కష్టంతో పురోగతి.. విజయాన్ని సాధిస్తారు. కెరీర్ లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఒడిదుడికులతో ప్రమోషన్, కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలం లేదు. వ్యాపారస్తులకు నష్టాలు లేకపోయినా.. లాభాలు రావు. కొత్తగా పెట్టుబడులుపెట్టకపోవడమే మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా పఠనం ద్వారా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి : ఇదే రాశిలో గురుడు.. చంద్రుడు కలిసి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ఊహించని మంచి జరిగే అవకాశం ఉంది. గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఏ పని చేసినా అందులో ఆదాయం వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు.
కర్కాటకరాశి : చంద్రుడు..గురుడు.. కలిసి మిథున రాశిలో గజకేసరి యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన... మానసిక ఒత్తిడి పెరుగుగుంది.. అతికష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆస్తి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోంది. ఉద్యోగస్తులు అవమానాలు పడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగు వేసే అవకాశం ఉంది. మీరు చేసే పనులను చాలా మంది వ్యతిరేకిస్తారు. పిల్లల విషయంలో అనేక సమస్యలు వస్తాయి. పెద్దల ఇష్టం లేకుండానే పెళ్లి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. చదివిన చదువుకు.. చేసే పనికి ఎలాంటి సంబంధం ఉండదు. డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
సింహ రాశి : ఈరాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టే ఛాన్స్ ఉంది. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసులు చాలా అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ లు అందుకుంటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. వ్యాపారస్తులు అధికంగా లాభాలను అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి : ఈ రాశి వారికి గురు,చంద్ర గ్రహాల కలియిక వలన చాలా అద్భుతంగా ఉండనుంది. అనుకున్న పనులన్నీ చాలా త్వరితగతిన పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్రహాల అనుకూలత అనేక విధాలుగా మీకు సహాయంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
తులా రాశి : చంద్రుడు, గురుడు కలయిక వలన మిథున వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారంగా ఆర్థికంగా ... కెరీర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు.. మీరు చేయని పనికి కూడా పై అధికారులు అపార్దం చేసుకునే అవకాశాలున్నాయి. ఎవరితోనూ ఎక్కువుగా మాట్లడకండి... ఎవరికి ఎలాంటి వాగ్డానాలు ఇవ్వవద్దు. మీరు చేపట్టే ప్రతి పనిలో ఆలస్యం.. అడ్డంకులు వస్తాయి. ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడాలి.
వృశ్చికరాశి : గురుడు, చంద్రుడు కలిసి మిథున రాశిలో సంచరించే సమయంలో ఈ రాశి అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనుకోని పరిస్థితుల వలన కొంతకాలం వేరే ప్రదేశంలో పరిచేయాల్సి రావచ్చు. కార్యాలయంలో సహోద్యోగులు, పై అధికారుల మద్దతు ఉంటుంది. అధిక పని వలన కొంత చికాకు ఏర్పడుతుంది. ఎవరితోనూ వాదన పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి. ఫలితం దానికదే వస్తుంది. ఆరోగ్యంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్థులు వృద్ది చెందే అవకాశం కలదు.
ధనుస్సురాశి : గురుడు.. చంద్రుడు మిథున రాశిలో సంచరించడం వలన ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అయితే మీరు చేయాలనుకునే పనిలో స్వల్ప ఆటంకాలు వస్తాయి. నిరుత్సాహ పడకుండా.. ముందుకు సాగండి. కొత్త వెంచర్లు ప్రారంభించాలకునేవారు.. ముందుగా దైవ దర్శనం చేసుకొని ఆ తరువాత ప్రారంభించండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
మకరరాశి : చంద్రుడు.. గురుడు కలిసి మిథున రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి అత్యంత ఫలవంతమైనది. సౌభాగ్యంతో పాటు లగ్జరీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది. ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి : ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. సంతోషంగా, సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్తారు. అన్ని రకాల రుణాలు తీర్చుకోగలుగుతారు. కెరీర్ లో మీరు విజయం సాధించేందుకు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్ లేదా వెంచర్ లో పని చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పనిలో మీకు మీ సీనియర్లకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా లాభపడతారు
మీనరాశి: ఈ రాశివారికి గురుడు.. చంద్రుడు మిథున రాశిలో సంచారం వలన మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్పొందే అవకాశం ఉంటుంది. పనిభారంతోపాటు అదనపు బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. కుటుంబ విషయాల కారణంగా అనవసరంగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం, సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బు ను పొందుతారు
