డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు..క్యూనెట్ సంస్థపై పోలీసుల దాడులు..32 మంది అరెస్ట్

డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు..క్యూనెట్ సంస్థపై పోలీసుల దాడులు..32 మంది అరెస్ట్

హైదరాబాద్:మల్టీ లెవెల్​డిజిటల్ మార్కెటింగ్​  మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ సంస్థపై సీసీఎస్​పోలీసులు దాడులు చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులు.. క్యూనెట్ ఆఫీస్ పేపర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్, లాప్టాప్, వాచ్ లు ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన 30 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వందల సంఖ్యలో బాధితులను మల్టీ లెవెల్​ మార్కెటింగ్​ పేరుతో మోసం చేసి వేలకోట్లు దండుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

అనంతరం  క్యూనెట్ మోసాలపై హైదరాబాద్​ సీపీ వీసీ సజ్జనార్​ ప్రెస్  మీట్​ లో వివవరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతోటు కర్ణాటకలోనూ క్యూనెట్​ సంస్థ వేల సంఖ్యలో బాధితులను మోసం చేసి వేల కోట్లు దండుకుందన్నారు. మూడు రాష్ట్రాల్లో  ఏకకాలంలో 30 చోట్ల దాడులు నిర్వహించి 32 మందిని అరెస్ట్​ చేశామన్నారు. 

హైదరాబాద్,వరంగల్ నంద్యాల,బెంగుళూరు, విశాఖపట్నంలో ఇంటిలిజెన్స్, సైబర్ పోలీసులం అందరం కలిసి దాడి చేశారు పోలీసులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గృహిణులు టార్గెట్ చేసి మోసాలు చేశారు.సిద్దిపేట మల్టీలేవల్ మార్కెటింగ్ లో మోసపోయి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని సజ్జనార్ తెలిపారు. 

మెటీరియల్ పెట్టుబడి కోసం లోన్ అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ చెన్నై,బెంగుళూరు, హైదరాబాద్ ,డిల్లీ ఇతర ప్రదేశాల్లో సాఫ్ట్​ వేర్​ లను టార్గెట్ చేశారు.అరచేతిలో వైకుంఠం లాగా లాభాలు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్నారని సీపీ అన్నారు. డిజిటల్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసాలపై సిట్ విచారణ కొనసాగుతుందన్నారుసీపీ సజ్జనార్​.