కేసీఆర్.. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏజెంట్ : షబ్బీర్​ అలీ 

కేసీఆర్.. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏజెంట్ :  షబ్బీర్​ అలీ 

కామారెడ్డి, వెలుగు: కేసీఆర్​ తన కూతురు కవిత బెయిల్  కోసం బీఆర్ఎస్  పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ ఆరోపించారు. బీఆర్ఎస్  పార్టీని, క్యాడర్ ను , ప్రజల నమ్మకాన్ని బీజేపీకి అమ్మేశారని ఆయన విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో షబ్బీర్​ అలీ మాట్లాడారు. కేసీఆర్  ఆర్ఎస్ఎస్​ ఏజెంట్​ అని, సెక్యులరిజంపై మాట్లాడే హక్కు ఆయన‌‌‌‌కు లేదన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్  ఒక్కటే అని గత కొద్ది రోజులుగా తాము చెబుతున్నామని, తాజా ఎన్నికల్లో అది నిజమని నిరూపణ అయ్యిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీకి 11 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్​లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.  ఇటీవల కామారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్​ రెడ్డికి కామారెడ్డి సమస్యలపై వినతిపత్రం ఇచ్చానని తెలిపారు.