ముదిరాజ్ లను బీసీ ఏలోకి మార్చేందుకు కృషి : బుర్ర జ్ఞానేశ్వర్

ముదిరాజ్ లను బీసీ ఏలోకి మార్చేందుకు కృషి : బుర్ర జ్ఞానేశ్వర్
  • రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ 

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలోని ముదిరాజ్ లను బీసీ డీ నుంచి  బీసీ ఏ గ్రూపులోకి మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్   వెల్ల డించారు. ఆదివారం నిర్మల్ జిల్లా  లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్ లు గా గెలిచి న ముదిరాజ్  లను సన్మానించారు.   ముఖ్య అతిథిగా హాజరైన జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ...  ముదిరాజులు రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.  

  బీసీ డీ నుంచి  బీసీఏలోకి  మార్చే విషయమై తాను ప్రభుత్వానికి  తెలియజేస్తానన్నారు.  ముదిరాజ్ లు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాల ని ఆకాంక్షించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో  కూడా ముదిరాజులు అధిక స్థాయిలో గెలుపొందాలని పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో రాష్ట్ర  సమన్వయ కమిటీ నాయకులు చొప్పరి శంకర్ , మద్దెల సంతోష్ , గుండ్లపల్లి శ్రీను , అల్లుడు జగన్ , బొజ్జ నారాయణ , శివయ్య పాల్గొన్నారు.