- సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య
- శ్రీరాంపూర్‌లో యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం
కోల్‌బెల్ట్/నస్పూర్వెలుగు: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చిత్తశుద్దితో పనిచేస్తుందని యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా సీసీసీలోని నర్సయ్య భవన్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం(ఏఐటీయూసీ) ముఖ్య కార్యకర్తల సమావేశం, మందమర్రిలోని యూనియన్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశాల్లో జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల సొంతింటి పథకం,పెర్క్స్‌పై ఐటీ యాజమాన్యం చెల్లింపు అంశాలపై స్ర్టక్చర్డ్ కమిటీ మీటింగ్‌లో మాట్లాడామని,వీటి పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. మైనింగ్‌స్టాఫ్,ట్రేడ్స్‌మెన్ మెడికల్ ఆన్ఫిట్ అయితే వారికి సర్పేస్లో సూటబూల్ జాబ్ ఇప్పించామని, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 35 నుంచి 40ఏళ్లకు పెంచామన్నారు.
కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే డిమాండ్‌తో యాజమాన్యం హైదరాబాద్‌లో ఆసుపత్రి నిర్మాణానికి ఒప్పుకుందని.. త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం రాష్ట్ర సర్కార్ రావాల్సిన రూ.45వేల కోట్ల విద్యుత్తు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో ప్రభుత్వ జోక్యం పెరిగిందని, సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జీ సీఎండీ ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారని పేర్కొన్నారు ఈనెల 18న సీపీఐ శతజయంతి ఉత్సవాలు, ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో సింగరేణియులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ,సీపీఐ లీడర్లతో కలిసి ఏఐటీయూసీ నూతన సంవత్సర క్యాలెడర్లను ఆవిష్కరించారు.సమావేశాల్లో సీపీఐ రాష్ట్ర నేత కలవేన శంకర్, ఏఐటీయూసీ కేంద్ర కమిటీ లీడర్లు ఎండి.అక్బర్అలీ,వీరభద్రయ్య,ముస్కె సమ్మయ్య,శ్రీరాంపూర్,మందమర్రి పాల్గొన్నారు.
