ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ మండలం అడవి సారంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లేడు కుంట గిరిజన గ్రామంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ను నిర్వహించారు. వైద్య శిబిరానికి అడవి సారంగా పూ ర్, రాజుల మడుగు,కొత్త వాడ గ్రామాలకు చెందిన ప్రజలు తరలి వచ్చి ఉచిత టెస్టులు చేయించుకున్నారు.
నిర్వహకులు వారికి ఉచితంగా మందులతో పాటు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ సత్య సా యి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు భీం సింగ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో సామాజిక, సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇం దు లో సర్పంచ్ అంకుశ్ రావ్, శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఖానాపూర్ కన్వీనర్ చిక్యాల ర త్న కర్ రావ్, సభ్యులు రాజేశ్వర్, సత్తయ్య తో పాటు బాబా భక్తులు తదితరులు ఉన్నా రు.
