మాలల ఐక్యత చాటేందుకే జెండా పండుగ : కొప్పుల రమేశ్

మాలల ఐక్యత చాటేందుకే  జెండా పండుగ : కొప్పుల రమేశ్
  •   మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్

​ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; మాలలందరినీ ఏకం చేసి ఐక్యతతో తమ హక్కులను సాధించడం కోసమే ఊరూరా మన ఊరు మన జెండా పండుగను నిర్వహిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం తాంసి బి గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో  మన జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు  అంబేద్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే తాము అనేక పదవులు పొందుతున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు, మాలల ఉప కులాలకు చాలా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేకల మల్లన్న, సింగరి అశోక్, సూరం భగవాండ్లు, రాళ్ళబండి శంకర్, నాయకులు, మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.