అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం..మార్చి 8న ఆవిష్కరణ!

అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం..మార్చి 8న ఆవిష్కరణ!

తెలంగాణ అసెంబ్లీలో  కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రాంగణంలో ఇప్పటికే విగ్రహ ఏర్పాటుకు కాంక్రీటు పనులను మొదలు పెట్టారు. బేస్ మెంట్ పనులు జరుగుతున్నాయి. 

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే. అదే వరుసలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. గాంధీ విగ్రహానికి ఎడమవైపు 8 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఉండగా.. కుడివైపు అదే ఎత్తులో  తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ విగ్రహానికి ప్రభుత్వం దాదాపు రూ. 34 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 

అసెంబ్లీ సమావేశాలకు ముందే అంటే మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నట్లు తెలుస్తోంది . మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.