గోదావరిఖని 11 ఇన్ క్లైన్ బొగ్గు గనిని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

గోదావరిఖని 11 ఇన్ క్లైన్ బొగ్గు గనిని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 11 ఇన్ క్లైన్ బొగ్గు గనిని సింగరేణి డ్రెస్ కోడ్ లో సందర్శించారు ఎంపీ వంశీకృష్ణ.బొగ్గు గని లోనికి(అండర్ గ్రౌండ్) వెళ్లి పని స్థలాలను పరిశీలించారు.  గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సింగరేణి కార్మికుల రక్షణే ధ్యేయంగా సేఫ్ అండ్ సేఫ్టీ రక్షణ చర్యలు  పాటించాలని అధికారులకు సూచించారు. కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ..ముఖ్యంగా మహిళ కార్మికుల ఎలాంటి సమస్యలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎంపీ. 

సింగరేణిలో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికీ తీసుకెళ్లిన సింగరేణి కార్మికులు. ఈ సందర్భంగా.. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు.  సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటు పై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో ఇప్పటికే మాట్లాడామని.. మరో సారి వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

సింగరేణి విశ్రాంతి కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చేలా పార్లమెంటులో ప్రస్తావించానన్నారు.  ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సీతారామన్ దృష్టికి తీసుకెళ్లానని  చెప్పారు. పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడు  సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతున్నట్లు చెప్పారు ఎంపీ వంశీ