జనవరిలో నిర్మల్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి : డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్

జనవరిలో  నిర్మల్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి : డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్

ఖానాపూర్,  వెలుగు : ఈనెల మూడో వారంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాకు వస్తున్నారని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అ న్నా రు. ఆదివారం ఖానాపూర్ మండలం మేడం పల్లి వద్ద  సదర్మాట్ ఆనకట్ట నుంచి రబీ పంటల సాగు కోసం నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన కల్ వద్ద  రూ 676.50 కోట్ల తో నూతనంగా నిర్మించిన సదర్ మాట్ ప్రాజెక్టు ను సీఎం రే వంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని తెలిపారు. సదర్ మాట్ అనకట్ట కింద రబీ పంటలు సా గు చేస్తున్న రైతులకు చివరి ఆయకట్టు వరకు వారాబందీ పద్ధతిలో  సాగు నీరు అంది స్తా మన్నారు.

 రైతులు సాగు నీరు ను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు.రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కేసీఆర్​ పాలనలో రైతులకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. ఇందులో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయా నం ద్, నీమ్మల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు అంకం రాజేందర్, కావాలి సంతోష్, నాయకులు జంగిలి శంకర్, జహీర్, షౌకత్ పాషా, శ్రీనివాస్,  శంకర్, గం గ న్న, నయీం తో పాటు తదితరులున్నారు.