మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్

మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్

న్యూఢిల్లీ: ఇండియా టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్ సాధించింది. దాంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–25లోకి వచ్చిన ఇండియా తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇటీవల జరిగిన సౌదీ స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రాణించిన 28 ఏండ్ల మనిక 39వ స్థానం నుంచి 15 ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మెరుగైంది. 2018 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మనిక  మూడుసార్లు వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన చైనా స్టార్ వాంగ్ మన్యును ఓడించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరుకొని  ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ నిలిచింది.