రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడాలొద్దు.. ఈసీకి టీఆర్టీఎఫ్, సీపీఎస్ఈయూ వినతి 

రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడాలొద్దు.. ఈసీకి టీఆర్టీఎఫ్, సీపీఎస్ఈయూ వినతి 

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఎంప్లాయీస్​కు రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడాలు లేకుండా చూడాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, కార్యదర్శి  అశోక్ కుమార్, సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన రెమ్యూనరేషన్ ఇవ్వడం సరికాదని, దీన్ని సరిచేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు.

నిబంధనల ప్రకారం రావాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరినందుకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ లో ఎంప్లాయీస్​ పై  లాఠీచార్జీ చేయడం దారుణమన్నారు. దీనికి కారణమైన ఆర్​డీఓ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అందరికి డ్యూటీ సర్టిఫికెట్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు.