టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్

టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్

హైదరాబాద్, వెలుగు : టెట్ అభ్యర్థులకు టీశాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈనెల 15 నుంచి 4 రోజుల పాటు 5 సబ్జెక్టులపై లైవ్ ఏర్పాటు చేశామని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. టీశాట్ నిపుణ చానెల్​లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష రాసే విధానంలో నిపుణులు సలహాలు -సూచనలు అందిస్తారని చెప్పారు.

అదేరోజు సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్  సబ్జెక్టులపై తరగతులు ఉంటాయన్నారు. లైవ్  ప్రసారాలు నిపుణ చానెల్​తో పాటు టీ-శాట్  విద్యా చానెల్​లో మరుసటి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పునఃప్రసారమౌతాయని వివరించారు.

ఇప్పటికే టెట్ అభ్యర్థుల కోసం సుమారు 200 ఎపిసోడ్లు టీ-శాట్  డొమైన్​లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల కోసం 040- 3540326/726, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4039కు కాల్ చేయవచ్చని సీఈఓ సూచించారు.