పారిస్: ఇండియా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్.. పారిస్ గేమ్స్‌లో పతకం లేకుండానే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన విమెన్స్ 75 కేజీ క్వార్టర్స్‌లో లవ్లీనా 1–4తో లి క్వియాన్ (చైనా) చేతిలో ఓడింది. దీంతో ఒలింపిక్స్‌లో ఇండియన్ బాక్సర్ల వేట ముగిసింది. టోక్యోలో కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా ఈసారి ఏదో ఓ పతకం తెస్తుందని భావించినా సక్సెస్ కాలేదు. బౌట్ ఆరంభంలో ఇద్దరు బాక్సర్లు పంచ్‌లు విసిరేందుకు సుముఖంగా కనిపించలేదు. ఎక్కువగా హోల్డింగ్‌కు మొగ్గడంతో రిఫరీ పదేపదే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తొలి రౌండ్ చివర్లో చైనీస్ బాక్సర్ కొన్ని క్లీన్ పంచ్‌లతో పాటు లెఫ్ట్ హూక్‌ను కనెక్ట్ చేయడంతో 3–2 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రౌండ్ కూడా దీనికి భిన్నంగా ఏమి జరగలేదు. క్వియాన్ స్ట్రయిట్ పంచ్‌లు కొట్టింది. చివరి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టిన క్వియాన్ ఈజీగా బౌట్ నెగ్గి సెమీస్ చేరింది.
స్కీట్‌లో బుల్లెట్ దిగలె..
విమెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్2లో ఇండియా షూటర్లు మహేశ్వరి 118 పాయింట్లతో 14వ స్థానం, రైజా ధిల్లాన్ 113 పాయింట్లతో 23వ స్థానం సాధించి ఫైనల్ చేరలేకపోయారు. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫికేషన్స్‌లో విజయ్‌వీర్ 583 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్తు కోల్పోయాడు. అనీశ్ భన్వాల 582 పాయింట్లతో 13వ స్థానంతో సంతృప్తి పడ్డాడు.
జెస్విన్, పారుల్ ఔట్
అథ్లెటిక్స్‌లోనూ ఇండియా నిరాశ పరుస్తోంది. స్టీపుల ఛేజర్ పారుల్ చౌదరి, లాంగ్ జంపర్ జెస్విన్ అల్డ్రిన్ ఫైనల్స్‌కు క్వాలిఫై కాలేకపోయారు. విమెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్ హీట్స్‌లో పారుల్ 9ని,23.39 సెకన్లతో ఓవరాల్‌గా 21వ స్థానంలో నిలిచి గేమ్స్ నుంచి వైదొలిగింది. ఇక మెన్స్ లాంగ్‌జంప్ క్వాలిఫికేషన్ గ్రూప్–బిలో ఆల్డ్రిన్ 7.61 మీటర్ల దూరం దూకి ఓవరాల్ క్వాలిఫికేషన్‌లో 26వ స్థానంతో
సరిపెట్టాడు.