హైదరాబాద్ ఆన్ వీల్స్ ఫెస్టివల్ను ప్రారంభించిన సజ్జనార్

హైదరాబాద్ ఆన్ వీల్స్ ఫెస్టివల్ను ప్రారంభించిన సజ్జనార్

ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని.. ఫోటోస్, విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితం అయిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్ ఆన్ వీల్స్ పేరిట ఏర్పాటు చేసిన ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ ను ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ, ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ ఆన్ వీల్స్ వెహికల్ ను సందర్శించారు.

ప్రజల్లో ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతను తెలియజేయడానికి హైదరాబాద్ ఆన్ వీల్స్ ఉపయోగపడుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. ప్రజల వద్దకు ఫోటోగ్రఫీని తీసుకెళ్లడం వినూత్న ప్రయత్నమని.. దేశంలోనే ఇది ఇది మొదటిసారి అని పేర్కొన్నారు. ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇది మంచి అవకాశమని అన్నారు.  హైదరాబాద్ సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని తెలిపేలా ఫోటోలు ప్రదర్శనలో ఉంచామని నిర్వాహకులు తెలిపారు.