నారాయణ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

నారాయణ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో విషాదం నెలకొంది. నారాయణ బాలికల క్యాంపస్ హాస్టల్‌లో వంశిక అనే విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డికి చెందిన  వంశికను  వారం రోజుల క్రితమే హాస్టల్ లో ఫస్టియర్ లో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. ఇవాళ ఉదయం  హాస్టల్ ఐదో అంతస్తు నుంచి  నుంచి దూకడంతో  అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని   పోస్టుమార్టం కోసం  గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు పోలీసులు. విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి పడిపోయిందా లేక ఇతర కారణాలేమైనా ఉంటాయా అని తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు.  వంశికది హత్య లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.