
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పాల్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పని చేస్తున్న ఓ యువతిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆధారాలతో షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సంబంధిత వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. కేఏ పాల్ విదేశాల్లో ఉండడంతో త్వరలోనే నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకు పిలవనున్నట్టు తెలుస్తోంది.