కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ  మంత్రి కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్ -అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది.

భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు  పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు.

యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి  నరేంద్రమోదీ  నేతృత్వంలో భారతదేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు.