సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా దృష్టి..ఇవాళ(అక్టోబర్ 14) వెస్టిండీస్‌‌‌‌తో నాలుగో టీ20

సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా దృష్టి..ఇవాళ(అక్టోబర్ 14) వెస్టిండీస్‌‌‌‌తో నాలుగో టీ20

 

  •     స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌కు నో చాన్స్‌‌‌‌
  •     రొమారియో షెఫర్డ్‌‌‌‌కు అవకాశం
  •     రా. 7 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌  

 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న ఇండియా బ్యాటర్లు.. వెస్టిండీస్‌‌‌‌తో నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యారు. ఉప్పల్‌‌‌‌ రాజీవ్‌‌‌‌గాంధీ స్టేడియంలో బుధవారం ఇరుజట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి ఇక్కడే సిరీస్‌‌‌‌ను పట్టేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. అదే టైమ్‌‌‌‌లో కరీబియన్లు లెక్క సరిచేసి సిరీస్‌‌‌‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఇది జరగాలంటే విండీస్‌‌‌‌ బౌలింగ్ దళం కేవలం రక్షణాత్మక ధోరణికి పరిమితం కాకుండా అంతకుమించి రాణించాల్సి ఉంటుంది. లేకపోతే హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ విధ్వంసకర బ్యాటర్లను ఆపడం కష్టంగా మారుతుంది. అయితే గ్రౌండ్‌‌‌‌లో జరిగే పోరులో ఫలితాన్ని ప్రధానంగా ఇరుజట్లలోని ‘పవర్‌‌‌‌ హిట్టర్లు’ నిర్ణయించే అవకాశం ఉంది.

‘టాప్‌‌‌‌’పైనే భారం..

ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇండోర్‌‌‌‌లో ఆడిన టీమ్‌‌‌‌ను యథాతధంగా బరిలోకి దించనున్నది. దాంతో చైనామన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ మరోసారి బెంచ్‌‌‌‌కే  పరిమితం కానున్నాడు. అద్భుతమైన ఫామ్‌‌‌‌లో ఉన్న టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ బ్యాటర్లపై ఇండియా భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ శర్మ, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ ఒక్కో మ్యాచ్‌‌‌‌లో రాణించడం వల్ల మిడిలార్డర్‌‌‌‌పై ఇప్పటి వరకు పెద్దగా ఒత్తిడి పడలేదు. కానీ భారీ లక్ష్య ఛేదనలో టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ విఫలమైతే.. మిడిల్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మ, నితీష్‌‌‌‌ కుమార్‌‌‌‌, నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ సవాళ్లను స్వీకరించాల్సి ఉంటుంది. పిచ్‌‌‌‌ను బట్టి ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ నితీష్‌‌‌‌తో పాటు ముగ్గురు పేసర్లు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను తీసుకోనున్నారు. ఏకైక స్పిన్నర్‌‌‌‌గా అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ ఆడనున్నాడు. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ జట్టు సభ్యులైన అభిషేక్‌‌‌‌, కిషన్‌‌‌‌, నితీష్‌‌‌‌కు ఈ వాతావరణంలో ఆడటాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. 

గెలుపే లక్ష్యంగా..

మరోవైపు టీమిండియా జోరును అడ్డుకునే మార్గం కోసం విండీస్‌‌‌‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తొలి మ్యాచ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ సెంచరీతో విజయాన్ని లాగేసుకోగా, తర్వాతి మ్యాచ్‌‌‌‌ల్లో శాంసన్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ను నియంత్రించడం విండీస్‌‌‌‌ బౌలర్లకు కష్టంగా మారింది. దాంతో ఇండియా టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌పై కరీబియన్‌‌‌‌ బౌలర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక విండీస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ షై హోప్‌‌‌‌, రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌, పావెల్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉన్నారు. రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ 189 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో 172 రన్స్‌‌‌‌ చేయగా, హోప్‌‌‌‌ 182 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో 159 రన్స్‌‌‌‌ సాధించాడు. వీళ్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. హెట్‌‌‌‌మయర్‌‌‌‌, కమిల్‌‌‌‌ పూరన్ గాడిలో పడాల్సి ఉంది. బౌలింగ్‌‌‌‌లో రొమారియో షెఫర్డ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ కోసం విండీస్‌‌‌‌ శిబిరం తీవ్రంగా శ్రమిస్తోంది. రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండగా... కీమో పాల్‌‌‌‌, షామెర్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌, గుడకేశ్‌‌‌‌ మోతీ ఆకట్టుకునే ప్రదర్శన చేయాల్సి ఉంది. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌, నితీష్‌‌‌‌ కుమార్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌. 

వెస్టిండీస్‌‌‌‌: షై హోప్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), కమిల్‌‌‌‌ పూరన్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, రొవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌, రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌, రొమారియో షెఫర్డ్‌‌‌‌ / క్వెంటిన్‌‌‌‌ సాంప్సన్‌‌‌‌, రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌, షామెర్‌‌‌‌ స్ప్రింగర్‌‌‌‌, కీమో పాల్‌‌‌‌, షామెర్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌, గుడకేశ్‌‌‌‌ మోతీ. 

పిచ్‌‌‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలం. ఈ ఏడాది జరిగిన ఏడు ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ సగటు స్కోరు 209. ఫ్లడ్‌‌‌‌ లైట్ల వెలుతురులో మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. టాస్‌‌‌‌ గెలిస్తే  ఛేజింగ్‌‌‌‌ను ఎంచుకోవచ్చు. వర్షం ముప్పు లేదు.