తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతిపెద్ద పార్టీగాఅవతరించిన విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకునేందుకు రెండు పార్టీలు రాత్రికి రాత్రే ఏకమయ్యాయన్నారు.. అధికారం కోసం బద్ధ శత్రువులు ఒక్కటయ్యారు..అన్నాడీఎంకేతో పొత్తుతో డీఎంకే అసలు రంగు బయపటిందన్నారు మాణిక్ ఠాకూర్..
తమిళనాడు రాజీకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 108 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా.. గవర్నర్ బలం నిరూపించుకోవాలంటూ తిరస్కరించారు.. ఇదిలా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ పొత్తు కూడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రె ఎంపీ మాణిక్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చిరకాల శత్రువులు , బద్ధ విరోధులు అయిన రెండు పార్టీలు అధికారంకోసం రాత్రికి రాత్రే ఒకటయ్యాయి.. అతిపెద్ద పార్టీ విజయ్ టీవీకే ను కాదని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెరవెనక కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఏకమయింది తమిళనాడు కోసం కాదు.. లౌకికవాదం కోసం కాదు.. కేవలం విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకునేందుకే స్పష్టంగా తెలుస్తోందని ఠాకూర్ అన్నారు.
‘‘ఆర్ ఎస్ ఎస్, బీజేపీలతో చేతులు కలిపిన అన్నాడీఎంకేతో డీఎంకే పొత్తు కలుపుకోవడం లౌకికవాదం అనిపించుకోదు..స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు అంటూ అధికారంకోసం రెండు పార్టీలు ఏకమయ్యాయి.. అన్నాడీఎంకేతో పొత్తుతో డీఎంకే ముసుగు తొలగిపోయింది.. ద్రోహులు ఎవరో తేలిపోయింది’’ అని ఎంపీ మాణిక్యం ఠాకూర్ Xలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
