మాచారెడ్డి(కామారెడ్డి), వెలుగు: ఊళ్లో జరిగిన గొడవలో తనకు న్యాయం జరగలేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వాడి గ్రామ ఉప సర్పంచ్సంగారెడ్డి శనివారం పోలీస్స్టేషన్ఆవరణలో సూసైడ్అటెంప్ట్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప సర్పంచ్సంగారెడ్డి, అతడి బంధువు బస్వారెడ్డి మధ్య వ్యవసాయ భూమికి వెళ్లే బాట విషయంలో వారం కింద గొడవైంది. ఈ క్రమంలో ఉపసర్పంచ్మెడలో ఉన్న బంగారు గొలుసు మిస్సయింది. దీనిపై గ్రామంలో పంచాయితీ పెట్టగా పెద్దలు చెప్పిన తీర్పును ఒప్పుకోని సంగారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరిని తహసీల్దార్వద్ద బైండోవర్చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్టేషన్లో తనకు న్యాయం జరగడం లేదని సంగారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత పురుగుల మందు డబ్బా తీసుకొచ్చి న్యాయం చేయాలని స్టేషన్లో సూసైడ్చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న ఏఎస్ఐ రాజేశ్వర్రెడ్డి అడ్డుకొని మందు డబ్బా లాక్కొని, అతన్ని స్టేషన్నుంచి బయటకు పంపించాడు.
