- జక్కన్న రిక్వెస్ట్కు వాటర్బోర్డు నో
- షూటింగ్ కోసం 150 ట్యాంకర్లు కావాలన్న రాజమౌళి
- సమ్మర్ అంటూ తిరస్కరణ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వారణాసి సినిమా షూటింగ్ కోసం 150 ట్యాంకర్ల నీళ్లు కావాలని దర్శకుడు రాజమౌళి చేసిన విజ్ఞప్తిని వాటర్ బోర్డు తిరస్కరించింది. వారణాసి సినిమా కోసం రాజేంద్ర నగర్ వద్ద నిర్మించిన ఆర్టిఫిషియల్ కొలనులో నీటిని నింపి షూటింగ్ చేసేందుకు సినిమా యూనిట్.. ట్యాంకర్ల కోసం దరఖాస్తు చేసుకున్నది.
10 వేల లీటర్ల కెపాసిటీగల 150 ట్యాంకర్లు కావాలని కోరింది. ఎండాకాలం కావడం, సిటీలోని చాలా ప్రాంతాలకు నీటి అవసరం ఉండడంతో నీరు ఇవ్వలేమని బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తేల్చిచెప్పారు. ముందు ప్రజల అవసరాలు చూడాలని, వారికి అవసరమైన వాటర్ ట్యాంకర్లు ఇవ్వడానికి తాము 24 గంటలు పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
