- శరవేగంగా పునర్నిర్మాణపనులు
- ఇప్పటికే 70 శాతం పూర్తి
- డిసెంబర్లోనే అందుబాటులోకి...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నారు. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురాగా, సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌ను కూడా ఎయిర్పోర్ట్తరహాలో డెవలప్చేస్తున్నారు. 2022లో పనులు ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే.. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి కాగా, అనుకున్న టైంలోగా రీ ఓపెన్చేయడానికి పనులు స్పీడప్చేస్తున్నారు.
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దేశంలోనే అత్యున్నత స్టేషన్‌గా నాన్సబర్బన్గ్రేడ్–1(ఎస్ఎస్జి1)ఉన్న సికింద్రాబాద్రైల్వే స్టేషన్నుంచి రోజుకు 180 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు1.60 లక్షల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
రాను రాను ప్రయాణికులు పెరుగుతుండడం, రైళ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్‌ను మరింత ఆధునీకరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సుమారు రూ. 714.73 కోట్లతో 2022లో స్టేషన్పునర్నిర్మాణ పనులు చేపట్టారు. 90 శాతం సివిల్‌పనులు పూర్తికాగా, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఎస్కలేటర్ల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులు శరవేగంగా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఏం సౌలత్లు ఉన్నాయంటే..
ఆధునిక హంగులతో ఒక ఐకానిక్ స్టేషన్‌గా సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. రైల్వేస్టేషన్‌ను 1,65,566 చ. మీ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఉత్తరం వైపున జి+3 ఫ్లోర్స్ (22516 చ. మీ.)తో, దక్షిణ వైపున జి+3ఫ్లోర్స్‌తో (14,792 చ. మీ. ) స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. పాత ప్లాట్‌ఫారాలు 30 ఫీట్లతో ఉంటే..ఇప్పుడు రెండు వైపులా 108 మీ.X120 మీ. సైజుల్లో నిర్మిస్తున్నారు. రెండు వైపు టెర్మినల్‌లో ఫస్ట్ లెవెల్లో కాఫీషాపులు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల కోసం ఏకంగా 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు కడుతున్నారు. రెండు వైపులా మల్టీలెవెల్పార్కింగ్సౌకర్యం కల్పిస్తున్నారు.
స్టేషన్ బయటకు రాకుండానే...
ట్రైన్దిగిన వారు నేరుగా బయటకు రాకుండా నేరుగా మెట్రోస్టేషన్లకు, బస్స్టేషన్లకు చేరుకునే విధంగా వాక్ త్రూ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్‌కోసం 5 కిలోవాట్ల కెపాసిటీతో రెండు భారీ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. భద్రత కోసం అడ్వాన్సుడ్సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 25 వేల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది గనక ఆ స్థాయిలో సౌకర్యలు కల్పిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత గంటకు 35 వేల మంది రాకపోకలు సాగించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరుపుతున్నారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు, ప్రయాణీకులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్టేషన్లో 3వేల మంది కూర్చునేలా వెయిట్హాల్, ఆధునిక క్యాంటీన్, రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయి.
