కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలోని తిమ్మక్‌పల్లి(కె)లో కొనుగోలు సెంటర్‌కు వడ్లను తీసుకొచ్చి 3 వారాలు దాటినా ఇంకా కాంట పెట్టకపోవటాన్ని నిరసిస్తూ శనివారం రైతులు ఆందోళనకు దిగారు. రోజులు గడుస్తున్నప్పటికీ కాంటాలు పెట్టకపోవడంపై రైతులు సెంటర్‌వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఆర్డీవో సురేందర్, ఐకేపీ అధికారులు అక్కడికి చేరుకోగా వారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో కాంటాలు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇవ్వడంలో రైతులు శాంతించారు.
ఆర్మూర్‌లో రైతుల రాస్తారోకో
ఆర్మూర్, వెలుగు: వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్మున్సిపల్పరిధిలోని పెర్కిట్ లో నేషనల్హైవేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పెర్కిట్ సొసైటీ పరిధిలో కొనుగోలు లో కాంటా వేయడం లేదని మండిపడ్డారు.
ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ ఫోన్లో అధికారులతో మాట్లాడించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
