హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 మే 05వ తేదీన హైద్రాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఓఆర్ఆర్‌పై రోజుకు సుమారు 2.8 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రోజుకు సగటున 5-6 ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను సున్నాకి తగ్గించాలని ఋ సందర్భంగా సీపీ సజ్జనార్ అధికారులకు సూచించారు.
ఓఆర్ఆర్ పై జరుగుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణాలు గుర్తించారు అధికారులు.
యాక్సిడెంట్స్ కు ప్రధాన కారణాలు:
- నిద్రమత్తు – 33%
- నిర్లక్ష్య డ్రైవింగ్ – 25%
- అతివేగం – 15%
- టైర్లు పేలడం – 14%
వాహనదారులకు మొబైల్ ద్వారా సేఫ్టీ అలర్ట్స్ పంపించే ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ఓఆర్ఆర్‌పై అనవసరంగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
►ALSO READ | హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. తప్పిన పెను ప్రమాదం
ఎమర్జెన్సీ సమయంలో రెస్పాన్స్ టైమ్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే ట్రాఫిక్ మార్షల్స్ సేవలు వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇకనుంచి వాహనాల ఫిట్‌నెస్, టైర్ల నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా రోడ్ సేఫ్టీపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడతాయనే మెసేజ్ వాహనదారుల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
