హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ పేలటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. ముందస్తు ప్రమాదాన్ని గుర్తించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి ఖాళీ చేయించారు. 2026 మే 05వ తేదీన హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన విమానంలో ఈ ప్రమాదం జరిగింది. 

హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో  6E108లో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. విమానంలో ఉన్న సిబంది వెంటనే విమానాన్ని ఖాళీ చేయించారు. ఛండీగఢ్ విమానాశ్రయంలో ప్రయాణీకులను క్యాబిన్ నుంచి టెర్మినల్ కు తరలించారు. 

విమానాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించాక ప్రయాణీకులను పంపించనున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్స్ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సేఫ్టీ మెజర్స్ పాటించినట్లు తెలిపారు. 

►ALSO READ | సీఎం సీటు నుంచి దిగనంటున్న దీదీ.. వాట్ నెక్ట్స్..? బెంగాల్లో ఇదే జరిగేది..!

పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్యాసెంజర్లు తెలిపారు. క్యాబిన్ అంతా పొగతో కమ్ముకుపోయినట్లు చెప్పారు. ఐదు మంది ప్యాసెంజర్ గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. 

అయితే పవర్ బ్యాంక్ లను ఇక నుంచి క్యారీ–ఆన్ లగేజ్ లో భాగంగా అనుమతించనున్నట్లు డీజీసీఏ తెలిపింది. పవర్ బ్యాంక్ ను విమానంలో వినియోగించేందుకు అనుమతించేది లేదని 2026  నిబంధనల్లో పేర్కొన్నారు.