ఆర్మూర్ లో ప్రజావాణి ప్రారంభించిన సబ్కలెక్టర్

ఆర్మూర్ లో ప్రజావాణి ప్రారంభించిన సబ్కలెక్టర్

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్- కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్​కలెక్టర్ అభిజ్ఞాన్​మాల్వియా కోరారు. సోమవారం తన ఆఫీస్​లో ప్రజావాణిని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి సోమవారం సబ్ -కలెక్టర్ ఆఫీస్​లో ప్రజావాణి ఉంటుందని తెలిపారు.

దరఖాస్తులు పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన నాలుగు ధరఖాస్తులను స్వీకరించారు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్, ఎంవీఐ రాహుల్, ఎంఈవో పింజ రాజగంగారాం, డీటీ సుజాత తదితరులు పాల్గొన్నారు.