మున్సిపల్ టికెట్ల కోసం మహిళలు పేర్లివ్వండి : సునీతా రావు

మున్సిపల్ టికెట్ల కోసం మహిళలు పేర్లివ్వండి : సునీతా రావు
  • రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పిలుపు 

హైదరాబాద్, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్న మహిళా కార్యకర్తలు తమ పేర్లను జిల్లాల వారీగా రాష్ట్ర కమిటీకి త్వరగా అందజేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు కోరారు.సోమవారం ఉదయం గాంధీ భవన్‌‌‌‌లో జరిగిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల్లో మహిళా కార్యకర్తలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. పోటీ చేయడంతోపాటు పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కూడా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సునీతా రావు పిలుపునిచ్చారు.