మెదక్ టౌన్, వెలుగు: యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత, డీఎంహెచ్వో శ్రీరామ్, డీసీహెచ్ఎస్ శివదయాల్తో కలిసి డీ అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించారు. కేంద్రం పనితీరు, ల్యాబ్, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్స విధానాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారికి చికిత్స అందించి, సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రం, షీల్డ్ ను బహూకరించి అభినందించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, టౌన్ సీఐ మహేశ్ పాల్గొన్నారు.
