వెయిట్‌‌లిఫ్టింగ్‌లో మీరాబాయి వరల్డ్‌ రికార్డు

వెయిట్‌‌లిఫ్టింగ్‌లో  మీరాబాయి వరల్డ్‌ రికార్డు


తాష్కెంట్‌‌‌‌: ఇండియా స్టార్‌‌ వెయిట్‌‌లిఫ్టర్‌‌ మీరాబాయి చాను..  క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌ విభాగంలో వరల్డ్‌‌ రికార్డు క్రియేట్‌‌ చేసింది. ఆసియా చాంపియన్‌‌షిప్‌‌లో భాగంగా శనివారం జరిగిన విమెన్స్‌‌ 49 కేజీ కేటగిరీ స్నాచ్‌‌లో 86 కేజీలు లిఫ్ట్‌‌ చేసిన మీరాబాయి.. క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌లో 119 కేజీల బరువు ఎత్తింది. దీంతో  గతంలో ఉన్న118 కేజీల క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఓవరాల్‌‌గా 205 కేజీల బరువును లిఫ్ట్‌‌ చేసిన ఇండియన్ లిఫ్టర్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో లాస్ట్‌‌ ఇయర్‌‌ ఫిబ్రవరి.. నేషనల్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో నెలకొల్పిన తన పర్సనల్‌‌ బెస్ట్‌‌ (88+115-=203 కేజీ)ను కూడా అధిగమించింది. స్నాచ్‌‌లో తొలి రెండు ప్రయత్నాల్లో చాను 85 కేజీలను కూడా ఎత్తలేకపోయింది. కానీ ఫైనల్‌‌ అంటెప్ట్‌‌లో 86 కేజీలను అవలీలగా లిఫ్ట్‌‌ చేసింది. క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌కు వచ్చేసరికి చాను వరుసగా 113, 117 కేజీలను సక్సెస్‌‌ఫుల్‌‌గా లిఫ్ట్‌‌ చేసింది. లాస్ట్‌‌ ప్రయత్నంలో 119 కేజీలు ఎత్తి రికార్డును సృష్టించింది.