సిద్దిపేటలో 10కోట్లతో పరిశ్రమల భవన నిర్మాణానికి శంకుస్థాపన

సిద్దిపేటలో 10కోట్లతో పరిశ్రమల భవన నిర్మాణానికి శంకుస్థాపన
  • పరిశ్రమల స్థాపనకు అన్ని వసతులతో అద్దెకు భవనాలు
  • సొంత డబ్బుతో అన్ని వసతులతో పరిశ్రమలు పెట్టలేని వారికి మంచి అవకాశం: మంత్ర్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట ‌ఇండస్ట్రియల్ పార్కులో రూ. పది కోట్లతో యువ పారిశ్రామిక వేత్తల‌ కోసం నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు ఆర్ధిక మంత్రి హరీశ్ రావు  శంకుస్థాపన చేశారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వసతులు కల్పించడంతోపాటు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వీలుగా భవన సముదాయాలు నిర్మించనున్నారు. 
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని వసతులతో  భవన నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. దాదాపు పదహారు మంది యువ పారిశ్రామిక వేత్తలకు ఈ భవన సముదాయంలో చిన్న, మధ్య తరహా యూనిట్లు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సొంత‌ డబ్బులతో భవనాన్ని నిర్మించుకుని పరిశ్రమ పెట్టలేని‌వారికి ఇది‌ మంచి అవకాశం అని మంత్రి పేర్కొన్నారు. అన్ని వసతులతో కూడిన ఈ భవనానికి అద్దె చెల్లించే ప్రాతిపదికన పారిశ్రామిక వేత్తలకు ఇస్తామని మంత్రి హరీష్ రావు వివరించారు.