
కార్మికుల సేఫ్టీ చాలా ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బేగంపేటలో కెమికల్,పారామెడికల్ ఫ్యాక్టరీస్ లో సేఫ్టీపై జరిగిన వర్క్ షాపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఫ్యాక్టరీలు సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పారు. రెడ్ క్యాటగిరిలో ఉన్న ఫ్యాక్టరీలు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందేనని చెప్పారు హెచ్చరించారు. రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు
ఫ్యాక్టరీల యజమానులు కార్మికుల సేఫ్టీని పట్టించుకోవాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యజమానులు కార్మికుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న లోపాలే ప్రమాదాలకు కారణమన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో చిన్న ప్రమాదం జరిగినా పెద్ద ముప్పేనని తెలిపారు. ఫ్యాక్టరీ డైరెక్టర్లు ప్రతీ మూడు నెలలకోసారి సమావేశమై సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. సిగాచి ఫ్యాక్టీర ఘటనలు మరోసారి జరగకూడదని ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.