పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఇరాన్లో 555 మందిని బలితీసుకున్న యుద్ధం..

పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఇరాన్లో 555 మందిని బలితీసుకున్న యుద్ధం..

యుద్ధం మొదలై మూడు రోజులవుతోంది.. ఎవరూ తగ్గటం లేదు. ఖమేనీ సహా కీలక నేతలను మట్టుబెట్టిన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు.. దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ మృతితో తోకతొక్కిన తాచులా ఇరాన్ కూడా తీవ్రంగా తిరగబడుతోంది. అమెరికాకు మద్ధతిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులక దిగుతోంది. సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలలోని ఆయిల్, నాచురల్ గ్యాస్ రీసోర్సెస్ లక్ష్యంగా మిసైళ్లను ప్రయోగిస్తో్ంది. ఇరువైపులా ప్రాణ, ఆస్తినష్టం పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. 

అయితే మూడు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇరాన్ లో ఇప్పటి వరకు 555 మంది చనిపోయినట్లు రెడ్ క్రెసెంట్ సొసైటీ సోమవారం (మార్చి 02) ప్రకటించింది. ఈ యుద్ధంలో 131 నగరాలు దాడులకు గురైనట్లు పేర్కొంది. 

ఇరాన్ లోని కీలక నతాన్జ్ న్యూక్లియర్ ఫెసిలిటీ పేలిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో రేడియేషన్ విడుదలై తీవ్ర పరిణామాలు ఎదుర్కునే అవకాశం ఉందని ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో ప్రకటించారు. రేడియేషన్ విడుదలవుతోందన్న హెచ్చరికలతో చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. 

►ALSO READ | పశ్చిమాసియా దేశాల్లో కోటి మంది భారతీయులు : ఈ నెంబర్లకు కాల్ చేస్తే.. మీ వాళ్లు ఎలా ఉన్నారో తెలుస్తుంది..!

మరోవైపు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. లెవెల్ 4.. ఇరాన్, ఇరాక్ వైపు ఎవరూ ప్రయాణించవద్దని హెచ్చరించారు. ఫిబ్రవరి 28కి ప్రకటించిన ప్రపం వ్యాప్త హెచ్చరికల తర్వాతనే యూఎస్ ఇరాన్ పై ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేయడంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉన్నట్లు భావిస్తున్నారు.