
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సెక్రటేరియట్ ను సందర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్ఫాంజలి సమర్పించారు.అనంతరం సచివాలయం ముందు ఫోటోలు దిగారు.
అంతకుముందు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. అందాల భామలకు పోలీస్ అశ్విక దళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్ తో స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారులకు కమాండ్ కంట్రోల్ రూమ్ లోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో.. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ చేపట్టిన ఇనిషియేటివ్ లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి.
ALSO READ | తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వాములు కండి : సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే తెలంగాణ పోలీసు కు చెందిన 80 వేల మంది నిరంతరం శాంతి, భద్రతలో నిమగ్నమై అత్యున్నత పోలీస్ గా నిలిచింది. షీ టీమ్స్, భరోసా, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీ సేఫ్, టీ.ఎస్ కాప్స్ , టెక్నాలజీస్, స్మార్ట్ పోలీస్, తదితర ఇనిషియేటివ్ లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అధికారులు. రాష్ట్రంలో 16 శాతం నేరాలు తగ్గాయి. సేఫ్ టూరిజం కేంద్రంగా తెలంగాణ ఉందని వివరించారు అధికారులు.